ఆయనపై సీబీఐ విచారణను ఆపండి
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై బాంబే హైకోర్టు ఆదేశించిన సీబీఐ విచారణను నిలుపుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారుతో పాటు అనిల్ దేశ్‌ముఖ్ సైతం మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ (అవినీతి ఆరోపణలకు సంబంధించి) నేపథ్యంలో బాంబే హైకోర్టు అనిల్‌పై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పదిహేను […]
దిశ, వెబ్‌డెస్క్ : మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై బాంబే హైకోర్టు ఆదేశించిన సీబీఐ విచారణను నిలుపుదల చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు మహారాష్ట్ర సర్కారుతో పాటు అనిల్ దేశ్‌ముఖ్ సైతం మంగళవారం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.
ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరంబీర్ సింగ్ దాఖలు చేసిన పిటిషన్ (అవినీతి ఆరోపణలకు సంబంధించి) నేపథ్యంలో బాంబే హైకోర్టు అనిల్‌పై విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. పదిహేను రోజుల్లో విచారణ ప్రారంభించి మరో 15 రోజుల్లో ముగించాలని కోర్టు పేర్కొంది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సీబీఐ బృందం ఒకటి ముంబయికి చేరుకుని పని మొదలుపెట్టింది.