చైనాతో రూ. 5వేల కోట్ల డీల్ నిలిపేసిన మహారాష్ట్ర

ముంబయి: చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రూ. 5,000 కోట్ల విలువైన ప్రాజెక్టును నిలిపేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దులో చైనా సైన్యం చేతిలో 20 మంది భారత జవాన్లు మరణించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఠాక్రే సర్కారు ఇటీవలే ‘మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0’ నిర్వహించింది. ఈ సమావేశంలో యూఎస్, దక్షిణ కొరియా, సింగపూర్‌తోపాటు […]

Update: 2020-06-22 08:39 GMT

ముంబయి: చైనా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్న రూ. 5,000 కోట్ల విలువైన ప్రాజెక్టును నిలిపేస్తున్న మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సరిహద్దులో చైనా సైన్యం చేతిలో 20 మంది భారత జవాన్లు మరణించిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రే సర్కారు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా దిగజారిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టేందుకు పెట్టుబడులను ఆహ్వానిస్తూ ఠాక్రే సర్కారు ఇటీవలే ‘మ్యాగ్నెటిక్ మహారాష్ట్ర 2.0’ నిర్వహించింది.

ఈ సమావేశంలో యూఎస్, దక్షిణ కొరియా, సింగపూర్‌తోపాటు చైనా పెట్టుబడిదారులూ పాల్గొన్నారు. ఈ సదస్సులో కుదిరిన 12 ఒప్పందాల్లో మూడు చైనా కంపెనీలతో ఖరారయ్యాయి. చైనాకు చెందిన మూడు కంపెనీలు హెంగ్లీ ఇంజనీరింగ్‌తో రూ. 250 కోట్లు, గ్రేట్ వాల్ మోటార్స్‌తో రూ. 3,770 కోట్లు, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీతో రూ. 1,000 కోట్ల విలువైన ప్రాజెక్టుల ఒప్పందాలు జూన్ 15న కుదిరాయి. ఈ ఒప్పందాలు కుదిరిన రోజే సరిహద్దులో 20 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ కారణంగా రూ. 5,000 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టుల గురించి కేంద్రంతో సంప్రదించి మహారాష్టర సర్కారు నిలిపేసింది. తదుపరి మార్గదర్శకాల కోసం వేచిచూస్తున్నట్టు మహారాష్ట్ర పారిశ్రామిక మంత్రి సుభాష్ దేశాయ్ తెలిపారు.

Tags:    

Similar News