ఇంకా ఏం అవసరం ఉంది : ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ జిల్లా కలెక్టర్ గౌతంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఆస్పత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులను కలిసి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంకా సమకూర్చుకోవడానికి ఏవేం అవసరాలు ఉన్నాయో చెప్పాలని అడిగారు. అనంతరం వైరలాజీ ల్యాబ్, డయాగ్నస్టిక్స్ హబ్, ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన రోగులపై వైద్యులు […]
దిశ, మహబూబాబాద్: మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రిని రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ జిల్లా కలెక్టర్ గౌతంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులతో ఆస్పత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో రోగులను కలిసి ఎలాంటి సౌకర్యాలు అందిస్తున్నారు అని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో ఇంకా సమకూర్చుకోవడానికి ఏవేం అవసరాలు ఉన్నాయో చెప్పాలని అడిగారు. అనంతరం వైరలాజీ ల్యాబ్, డయాగ్నస్టిక్స్ హబ్, ఆసుపత్రిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆసుపత్రికి వచ్చిన రోగులపై వైద్యులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి హరీష్ రాజ్, సూపరింటెండెంట్ వెంకట్రాములు, భవాని తదితరులు పాల్గొన్నారు.