వరంగల్ లో పోలీసుల వినూత్న ప్రచారం

దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాలోకి కరోనా అడుగు పెట్టకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ముఖ్యమైన కూడలిలో మాస్కులు పెట్టుకోవాలని మైక్ లో ప్రచారం చేస్తూ మాస్కులు లేని వారికి చేతులెత్తి దండం పెడుతూ వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న మాస్కులు తీసి వారికి అందజేశారు. మాస్కులు లేకుండా […]

Update: 2020-05-15 05:25 GMT

దిశ, వరంగల్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీసులు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించారు. జిల్లాలోకి కరోనా అడుగు పెట్టకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. శుక్రవారం జిల్లా ఎస్పీ ఎన్. కోటిరెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ముఖ్యమైన కూడలిలో మాస్కులు పెట్టుకోవాలని మైక్ లో ప్రచారం చేస్తూ మాస్కులు లేని వారికి చేతులెత్తి దండం పెడుతూ వారికి అవగాహన కల్పించారు. అంతేకాకుండా వారి వద్ద ఉన్న మాస్కులు తీసి వారికి అందజేశారు. మాస్కులు లేకుండా కనిపిస్తే కేసుల పాలవుతారని రూ. 1000 జరిమానా విధించాల్సి ఉంటుందని హెచ్చరించారు.

Tags:    

Similar News