సెల్యూట్ కలెక్టర్ సాబ్..

దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉంటూనే మరోపక్క మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. విధుల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడి సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ రోగికి రక్తం అత్యవసరమని తెలియడంతో ఏ మాత్రం ఆలోచించకుండా రక్తదానం చేసి తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. ఆపత్కాలంలో సరైన సమయానికి స్పందించి రక్తదానం చేసిన కలెక్టర్ ‌గౌతమ్‌కు […]

Update: 2020-04-07 11:25 GMT

దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉంటూనే మరోపక్క మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. విధుల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడి సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ రోగికి రక్తం అత్యవసరమని తెలియడంతో ఏ మాత్రం ఆలోచించకుండా రక్తదానం చేసి తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. ఆపత్కాలంలో సరైన సమయానికి స్పందించి రక్తదానం చేసిన కలెక్టర్ ‌గౌతమ్‌కు వైద్యులు, సిబ్బంది, అధికారులు, రోగి తరఫు బంధువులు ఫిదా అయ్యారు.

Tags: mahabubabad, collector VP Gautham, humanity, blood donation, Area hospital, patient, corona, virus,

Tags:    

Similar News