అయ్యయ్యో.. మగవాళ్లకి గృహహింస చట్టం లేదే..
దిశ, వెబ్‌డెస్క్: గృహహింస చట్టంకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య తన భర్తపై కేసు పెట్టడానికి గృహహింస చట్టం ఉందని, కానీ భార్య హింస పెడితే భర్త కేసు పెట్టడానికి గృహహింస చట్టం లేకపోవడం దురదృష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. శశికుమార్‌పై అతడి భార్య 2015లో గృహహింస కేసు పెట్టింది. గృహహింస అరోపణల క్రమంలో […]
దిశ, వెబ్‌డెస్క్: గృహహింస చట్టంకు సంబంధించి మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. భార్య తన భర్తపై కేసు పెట్టడానికి గృహహింస చట్టం ఉందని, కానీ భార్య హింస పెడితే భర్త కేసు పెట్టడానికి గృహహింస చట్టం లేకపోవడం దురదృష్టమంటూ హైకోర్టు వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది. శశికుమార్ అనే వెటర్నరీ వైద్యుడు వేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
శశికుమార్‌పై అతడి భార్య 2015లో గృహహింస కేసు పెట్టింది. గృహహింస అరోపణల క్రమంలో శశికుమార్‌ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై శశికుమార్ గత ఏడాది హైకోర్టును ఆశ్రయించారు. తన భార్య తనను చిత్రహింసలు పెట్టిందని, దానికి గాను తనను విధుల నుంచి తొలగించడం సరికాదని పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో శశికుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. గృహహింస చట్టం వచ్చినప్పటి నుంచి పవిత్రత అన్న పదానికి అర్థం లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది.