సీఐడీకి అప్పగిస్తే పరువుపోతుంది: మద్రాస్ హైకోర్టు
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ ఆఫీసులో బంగారం మాయం ఘటనపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐపై విచారణకు సీఐడీకి అప్పగిస్తే పరువుపోతోందని అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐకి ప్రత్యేకంగా కొమ్ములేవీ ఉండవని జడ్జి పీఎన్ ప్రకాశ్ అన్నారు. లోకల్ పోలీసులకు మీకు తోకలుగా భావించొద్దని.. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష లాంటిదని న్యాయస్థానం అభిప్రాయపడింది. బంగారం మాయం విషయంలో సీబీఐ తన నిజాయితిని నిరూపించుకోవాలని.. లేనిపక్షంలో జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్రాస్ కోర్టు […]
దిశ, వెబ్‌డెస్క్: సీబీఐ ఆఫీసులో బంగారం మాయం ఘటనపై మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. సీబీఐపై విచారణకు సీఐడీకి అప్పగిస్తే పరువుపోతోందని అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు. దీంతో సీబీఐకి ప్రత్యేకంగా కొమ్ములేవీ ఉండవని జడ్జి పీఎన్ ప్రకాశ్ అన్నారు. లోకల్ పోలీసులకు మీకు తోకలుగా భావించొద్దని.. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష లాంటిదని న్యాయస్థానం అభిప్రాయపడింది. బంగారం మాయం విషయంలో సీబీఐ తన నిజాయితిని నిరూపించుకోవాలని.. లేనిపక్షంలో జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని మద్రాస్ కోర్టు హెచ్చరించింది.