మాస్క్ వినియోగాన్ని హేళన చేశాడు.. కరోనా కోరల్లో చిక్కాడు
భోపాల్ : ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడిపోతున్నా.. సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. మాకేం కాదులే.. మేం అతీతులం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ సూచనలను హేళన చేయడమే కాదు.. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరులకూ ప్రమాదంగా మారుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాస్క్ వినియోగాన్ని చిన్నచూపు చూశాడు. అనంతరం కరోనా కోరల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు. సాగర్ నగరానికి చెందిన 25ఏళ్ల ఎలక్ట్రీషియన్.. మాస్క్‌లను ప్రహసిస్తూ టిక్‌టాక్‌లో ఓ […]
భోపాల్ : ప్రపంచమంతా కరోనాతో విలవిల్లాడిపోతున్నా.. సామాజిక దూరం పాటించాలని, మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా.. కొందరు పెడచెవిన పెడుతున్నారు. మాకేం కాదులే.. మేం అతీతులం అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.ప్రభుత్వ సూచనలను హేళన చేయడమే కాదు.. నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇతరులకూ ప్రమాదంగా మారుతున్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాస్క్ వినియోగాన్ని చిన్నచూపు చూశాడు. అనంతరం కరోనా కోరల్లో చిక్కుకున్నాడు. ఇప్పుడు బాధపడుతున్నాడు.
సాగర్ నగరానికి చెందిన 25ఏళ్ల ఎలక్ట్రీషియన్.. మాస్క్‌లను ప్రహసిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో షేర్ చేశాడు. ఈ క్లాత్ పీస్‌ను నమ్మడం కాదు… దేవుడిని నమ్మాలని వీడియో తీశాడు. వాస్తవంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను బేఖాతరు చేశాడు. తర్వాత అతనికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇప్పుడు బుందేల్‌ఖండ్ మెడికల్ ఆస్పత్రి బెడ్‌పై పడుకుని ‘నా ప్రాణాల కోసం ప్రార్థించండి ఫ్రెండ్స్’ అని ప్రాధేయపడుతూ మరో టిక్‌టాక్ వీడియోలో పేర్కొన్నాడు. కాబట్టి సర్కారు చేస్తున్న సూచనలను, నిబంధనలు తప్పక పాటించి ప్రాణాలను కాపాడుకోవాలని పలువురు చెబుతున్నారు.
Tags: coronavirus, positive, mask, trust, madhya pradesh, mocked