పురుషుడిగా మారాలనుకున్న లేడీ కానిస్టేబుల్.. వెంటనే ఏం చేసిందంటే.?

దిశ, వెబ్‌డెస్క్: లింగ మార్పిడి చేయించుకునేందుకు ఓ కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్స్‌ను అనుమతి కోరారు. అందుకుగాను ఓ దరఖాస్తును పెట్టుకున్నారు. దానికి అఫిడఫిట్‌నూ జత చేశారు. ఆ కానిస్టేబుల్ కోరిక తెలుసుకున్న హెడ్ క్వార్టర్స్ ఆ దరఖాస్తును హోం శాఖకు పంపారు. ఈ విషయంలో హోంశాఖ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌లో పడేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ తాను లింగ మార్పిడి చేయిచుకునేందుకు అనుమతి కోరుతూ హెడ్‌క్వార్టర్స్‌ను దరఖాస్తు […]

Update: 2021-12-01 21:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: లింగ మార్పిడి చేయించుకునేందుకు ఓ కానిస్టేబుల్ హెడ్ క్వార్టర్స్‌ను అనుమతి కోరారు. అందుకుగాను ఓ దరఖాస్తును పెట్టుకున్నారు. దానికి అఫిడఫిట్‌నూ జత చేశారు. ఆ కానిస్టేబుల్ కోరిక తెలుసుకున్న హెడ్ క్వార్టర్స్ ఆ దరఖాస్తును హోం శాఖకు పంపారు. ఈ విషయంలో హోంశాఖ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్‌లో పడేసింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. 2019లో మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ మహిళా కానిస్టేబుల్ తాను లింగ మార్పిడి చేయిచుకునేందుకు అనుమతి కోరుతూ హెడ్‌క్వార్టర్స్‌ను దరఖాస్తు పంపింది. తనకు చిన్నప్పటి నుంచి పురుష లక్షణాలు ఉన్నాయని తెలిపింది. వీటిని సమర్థిస్తూ సైకాలజిస్టుల నిర్ధారణ పత్రాలను కూడా దరఖాస్తుకు జోడించింది. దీనిని పరిశీలించిన హెడ్ క్వార్టర్స్ దరఖాస్తును హోం శాఖకు పంపింది. అంతా పరిశీలించిన ప్రభుత్వం ఆమెకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఈ మేరకు విషయాన్ని హోం శాఖ అదనపు కార్యదర్శి రాజేష్ రాజోరా తెలిపారు. అయితే నిబంధనల ప్రకారం భారత పౌరులు కులం, మతం సంబంధం లేకుండా లింగమార్పిడి చేయించుకోవచ్చని, వాటికి లోబడే సదరు మహిళా కానిస్టేబుల్‌కు అనుమతినిచ్చినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో హోంశాఖకు ఇలాంటి దరఖాస్తు రావడం తొలిసారి అనుకుంటే.. అందుకు ప్రభుత్వం అనుమతించడం కూడా ఇదే తొలిసారి.

Tags:    

Similar News