సర్కారు ఆదేశం.. జీన్స్, టీషర్టులు ధరించొద్దంట
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్సింగ్ విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్వాలియర్ డివిజన్ లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీషర్టులు ధరించడంపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరైనా ఈ ఉత్తర్వులను భేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు గౌరవ ప్రదమైన సాంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహించాలనేది ప్రభుత్వ […]
దిశ, వెబ్ డెస్క్: ప్రభుత్వ ఉద్యోగుల డ్రెస్సింగ్ విషయంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో పలు ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. గ్వాలియర్ డివిజన్ లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు కార్యాలయాలకు జీన్స్, టీషర్టులు ధరించడంపై నిషేధం విధించింది. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది.
ఎవరైనా ఈ ఉత్తర్వులను భేఖాతరు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు గౌరవ ప్రదమైన సాంప్రదాయ దుస్తుల్లో విధులు నిర్వహించాలనేది ప్రభుత్వ ఉద్దేశమని స్పష్టం చేసింది. అయితే, జూలై 20న జరిగిన ఓ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధ్యక్షతన వహించారు. ఓ అధికారి టీ షర్టు ధరించి ఈ సమావేశానికి హాజరయ్యాడు. దీంతో సీఎం ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.