టెన్త్ క్లాస్ విద్యార్థినికి బహుమతిగా ఇల్లు
ఇష్టపడి పని చేస్తే కష్టం అంటూ ఉండదని ఓ బాలిక నిరూపించింది. తనకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోయిన తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. తన పేదరికానికి సవాల్ విసిరి అధికారుల మన్ననాలు పొందడంతోపాటు తన తల్లిదండ్రులకు గూడును కలిపంచింది. మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన భారతీ ఖండేకర్ కు చదువంటే పంచప్రాణాలు. ఆమె ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నది. కానీ తన కుటుంబం కటిక పేదరికాన్ని అనుభవిస్తోంది. భారతీ తల్లిదండ్రులు దినసరి కూలీలు. తండ్రి […]
ఇష్టపడి పని చేస్తే కష్టం అంటూ ఉండదని ఓ బాలిక నిరూపించింది. తనకు కనీస మౌలిక సదుపాయాలు లేకపోయిన తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది. తన పేదరికానికి సవాల్ విసిరి అధికారుల మన్ననాలు పొందడంతోపాటు తన తల్లిదండ్రులకు గూడును కలిపంచింది.
మధ్యప్రదేశ్ ఇండోర్ కు చెందిన భారతీ ఖండేకర్ కు చదువంటే పంచప్రాణాలు. ఆమె ఉన్నత చదువులు చదవాలని కలలు కన్నది. కానీ తన కుటుంబం కటిక పేదరికాన్ని అనుభవిస్తోంది. భారతీ తల్లిదండ్రులు దినసరి కూలీలు. తండ్రి దశరథ్ తన భార్య, ముగ్గురు పిల్లలతో ఫుట్ పాత్‌పై జీవినం సాగిస్తూ కూలీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
అటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టింది భారతీ ఖండేకర్. చదువుకుంటే తప్ప తమ జీవితాలు మారవని అంత చిన్న వయసులోనే నమ్మిన భారతి కష్టపడి చదువుకుంది. అందుకే ఉండటానికి ఇల్లు లేకపోయినా.. వేసుకోవడానికి సరైన బట్టలు లేకపోయినా.. ప్రభుత్వ పాఠశాలకు వెళ్తూ.. ఫుట్ పాత్‌పై కూర్చొని చదివి పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఫస్ట్ క్లాస్ సంపాదించుకుంది. ఇటీవల వచ్చిన టెన్త్ క్లాస్ పరీక్షల్లో 68 శాతం మార్కులు సాధించింది.
ఆ బాలిక విషయం తెలిసిన మున్సిపల్ అధికారులు భారతీకి బహుబతిగా ఇంటిని ఇచ్చారు. భారతి ఇంకా పై చదువులు చదువుకోవాలని, మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పారు. కాగా కలెక్టర్‌ని కావాలనేది తన కోరిక అంటూ ఆ బాలిక పట్టుదలతో చెప్పింది. తన కుమార్తె ప్రతిభ కారణంగా నిలువ నీడ దొరికినందుకు ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.