సైకిల్ తొక్కుతూ సాధించింది
భోపాల్: ఆ విద్యార్థిని పడ్డ కష్టానికి ‘ఫలితం’ దక్కింది. ప్రతి రోజూ 24 కిలోమీటర్లు (అప్ అండ్ డౌన్) సైకిల్‌పై బడికి వెళ్లి చదువుకున్న మధ్యప్రదేశ్ భీండ్ జిల్లా విద్యార్థిని రోషిణి బదౌరియా పది ఫలితాల్లో 98.5శాతంతో స్టేట్ ఎనిమిదో ర్యాంక్ కొట్టింది. రమారమి వెయ్యి మంది జీవిస్తున్న అజ్నోల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని మేహ్‌గావ్‌లోని స్కూల్‌కు రోషిణి సైకిల్‌పై వెళ్లేది. వర్షాలు పడితే ఇంటికి వెళ్లకుండ బంధువుల ఇళ్లల్లో ఉండేది. ఆమె తండ్రి రైతు, […]
భోపాల్: ఆ విద్యార్థిని పడ్డ కష్టానికి ‘ఫలితం’ దక్కింది. ప్రతి రోజూ 24 కిలోమీటర్లు (అప్ అండ్ డౌన్) సైకిల్‌పై బడికి వెళ్లి చదువుకున్న మధ్యప్రదేశ్ భీండ్ జిల్లా విద్యార్థిని రోషిణి బదౌరియా పది ఫలితాల్లో 98.5శాతంతో స్టేట్ ఎనిమిదో ర్యాంక్ కొట్టింది. రమారమి వెయ్యి మంది జీవిస్తున్న అజ్నోల్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలోని మేహ్‌గావ్‌లోని స్కూల్‌కు రోషిణి సైకిల్‌పై వెళ్లేది. వర్షాలు పడితే ఇంటికి వెళ్లకుండ బంధువుల ఇళ్లల్లో ఉండేది. ఆమె తండ్రి రైతు, తన బిడ్డ పెద్ద సదువులు సదివి పెద్ద కొలువులో చేరాలని ఆ రైతు ఆశపడుతుండగా.. తాను ఐఏఎస్‌లో చేరి ప్రజలకు మంచి చేయాలని భావిస్తున్నట్టు రోషిణి సంకల్పించినట్టు తెలిపింది.