‘మా’ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్

దిశ వెబ్‌డెస్క్: గత రెండు నెలల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 10 వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత కార్యవర్గం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నుకున్న కార్యవర్గం గడువు సెప్టెంబర్ రెండో వారంతో పూర్తవబోతుంది. దాంతో సినీ పరిశ్రమలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈసారి ఎన్నికలను ప్రతి వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ […]

Update: 2021-08-25 08:35 GMT

దిశ వెబ్‌డెస్క్: గత రెండు నెలల నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 10 వ తేదీన ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రస్తుత కార్యవర్గం ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం ఎన్నుకున్న కార్యవర్గం గడువు సెప్టెంబర్ రెండో వారంతో పూర్తవబోతుంది. దాంతో సినీ పరిశ్రమలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈసారి ఎన్నికలను ప్రతి వర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం మొదలు పెట్టింది. ఇప్పటికే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ తను ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించగా, మరోవైపు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు హీరో విష్ణు కూడా ఎన్నికల బరిలో దిగనున్నట్లు వెల్లడించారు. ఎవరి దగ్గర చందాలు వసూలు చేయకుండా సొంతంగా తన డబ్బులతో ‘మా’ బిల్డింగ్ నిర్మిస్తామని ఆయన హమీ ఇచ్చారు. వీరితో పాటు సీనియర్ నటుడు నరసింహరావు, జీవిత రాజశేఖర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ సైతం మా అధ్యక్షుల బరిలో నిలుచున్నారు.

ప్రకాష్‌రాజ్‌కు మెగాస్టార్ చిరంజీవి బలం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ వాదనలకు బలం అన్నట్లుగా మెగా బ్రదర్ నాగబాబు, ప్రకాష్‌రాజ్ తరుపున ఎన్నికల ప్రచారంలో దిగారు. వీరికి దాదాపు 30 మంది ప్యానెల్ సభ్యుల బలం ఉందని తెలుస్తోంది. అయితే ప్రత్యర్థులు ప్రకాష్ నాన్ లోకల్ అంటూ ప్రచారం నిర్వహిస్తున్నారు. వివిధ బాషల్లో నటించే ఆయనకు తెలుగు ఇండస్ట్రీలో జరిగే విషయాలు ఏం తెలుసని ప్రశ్నిస్తున్నారు. అలాగే యాక్టింగ్ లో బిజీగా ఉంటూ, ఏం సేవ కార్యక్రమాలు చేస్తారని అంటున్నారు. మరోవైపు ప్రతి ఎన్నికల సమయంలో హట్ టాపిక్‌గా మారిన మా బిల్డింగ్ నిర్మాణానికి ఇంతకు ముందు ఎన్నికల్లో గెలవడానికి ఇచ్చిన హమీలనే ఇస్తున్నాడని విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే వీటిని ప్రకాష్ రాజ్ కొట్టి పారేశారు. తను మహబూబ్‌నగర్‌లో నివాసం ఉంటున్నానని, ఇక్కడ ప్రభుత్వం పిలుపుతో ఓ గ్రామాన్ని సైతం దత్తత తీసుకొని సేవా కార్యక్రమాలు చేస్తున్నాని వెల్లడించారు.

మరో నటుడు మంచు మోహన్‌బాబు తనయుడు హీరో విష్ణు సైతం మా ఎన్నికల బరిలో నిలిచాడు. ఇప్పటికే తన సొంత డబ్బుతో మా బిల్డింగ్‌ను కడతానని హమీ ఇవ్వటంతో ఈ ఎన్నికల్లో తానే ప్రధాన పోటీదారని ప్రకటించినట్లయింది. విష్ణుకు ఇప్పటికే సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణతో పాటు రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలయ్య లాంటి స్టార్‌ల సపోర్ట్ ఉన్నట్లు దండిగా వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ప్రస్తుత అధ్యక్షుడు వీకే నరేష్ మద్దతు కూడా విష్ణుకే ఉన్నట్లు ఫిల్మింనగర్ సర్కిల్లో వినిపిస్తున్నమాట. అయితే విష్ణు కుర్రాడని ప్రత్యర్థి వర్గం ప్రచారం నిర్వహిస్తోంది. సొంతంగా ఎలా కడతాడో మాటలు కాదు. ప్రణాళిక వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదీ ఏమైన మరోసారి మా ఎన్నికల్లో హీరోల మధ్య మాటల యుద్ధం తప్పేలా కనిపించటం లేదు.

Tags:    

Similar News