RK Roja:సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్?
ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో కూటమి ప్రభుత్వం(AP Government) పై వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి రోజా మరోసారి విమర్శలు గుప్పించారు. ఇవాళ(గురువారం) తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. టీటీడీ ఎస్వీ గోశాల వ్యవహారం పై ఆమె మాట్లాడుతూ.. టీడీపీ నేతల సవాల్‌కి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సిద్ధమయ్యారని తెలిపారు. గోశాల వద్దకు ఆయనను అనుమతించే ధైర్యం టీడీపీకి ఉందా? అని ఆమె ప్రశ్నించారు.
సవాల్ చేసిన వాళ్లే అడ్డుకోవడం ఎంత వరకు కరెక్ట్ అని మాజీ మంత్రి రోజా(Former Minister Roja) మండిపడ్డారు. టీటీడీ(TTD) ప్రతిష్ట రోజు రోజుకు దెబ్బతింటుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan)ను మరోసారి సనాతన ధర్మం ఇదేనా అంటూ నిలదీశారు. ఈ క్రమంలో టీటీడీ ఎస్వీ గోశాలలో ఆవుల మృతిపై కమిటీ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. తమ పార్టీ నేతలు ఆధారాలతో సహా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఛాలెంజ్‌లు విసరకూడదని ఆమె మండిపడ్డారు. తమ నేతల జోలికి వస్తే ఊరుకోమని మాజీ మంత్రి రోజా హెచ్చరించారు.