ఎల్‌వీపీఇఐకు ‘అత్యుత్తమ సంస్థ’గా రేటింగ్
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని దృష్టి పునరావాస కేంద్రం (ఇనిస్టిట్యూట్ ఫర్ విజన్ రీహాబిలిటేషన్) దృష్టి లోపం గల వ్యక్తులకు విశేష సేవలు అందిస్తోంది. సంస్థ అందిస్తున్న సేవలకుగాను అత్యుత్తమ సంస్థ విభాగంలో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ నుండి ప్రతిష్ఠాత్మక సరోజిని త్రిలోక్ నాథ్ జాతీయ పురస్కారాన్ని అందుకుంది . వర్చువల్‌గా నిర్వహించిన పురస్కార వేడుకలో ఎల్‌వీపీఇఐ-విజన్ రీహాబిలిటేషన్ కేంద్రం అధిపతి డాక్టర్ బ్యూలా క్రిస్టీకి ఈ […]
దిశ ప్రతినిధి ,హైదరాబాద్: ఎల్‌వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థలోని దృష్టి పునరావాస కేంద్రం (ఇనిస్టిట్యూట్ ఫర్ విజన్ రీహాబిలిటేషన్) దృష్టి లోపం గల వ్యక్తులకు విశేష సేవలు అందిస్తోంది. సంస్థ అందిస్తున్న సేవలకుగాను అత్యుత్తమ సంస్థ విభాగంలో నేషనల్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ నుండి ప్రతిష్ఠాత్మక సరోజిని త్రిలోక్ నాథ్ జాతీయ పురస్కారాన్ని అందుకుంది . వర్చువల్‌గా నిర్వహించిన పురస్కార వేడుకలో ఎల్‌వీపీఇఐ-విజన్ రీహాబిలిటేషన్ కేంద్రం అధిపతి డాక్టర్ బ్యూలా క్రిస్టీకి ఈ పురస్కారాన్ని బహూకరించారు.
‘ప్రపంచ వ్యాప్తంగా తమ సేవలో భాగంగా దృష్టి పునరావాస సేవలను అందిస్తున్న అతి కొద్ది నేత్ర సంరక్షణా కేంద్రాలలో ఎల్‌వీపీఇఐ ఒకటి. గత 30 సంవత్సరాల కాలంలో, ఎల్‌వీపీఇఐ 2లక్షలకు పైగా దృష్టి మాంద్యం , అంధత్వం కలిగినవారికి విజయవంతంగా పునరావాసాన్ని కల్పించింది. సంస్థ , సమాజ ఆధారిత మార్గాలద్వారా చికిత్స చేయలేనటువంటి కంటి చూపు హాని కలిగినవారు స్వతంత్రంగా, గౌరవప్రదంగా జీవించడంలో వారికి సహాయపడుతోంది. తద్వారా వారు సాధికారతను సాధించడమే లక్ష్యంగా పని చేయడంతో అత్యుత్తమమైన రేటింగ్‌ను అందుకున్నట్లు డాక్టర్ బ్యూలా క్రిస్టీ తెలిపారు.