లగ్జరీ కార్ల విక్రయాల్లో వృద్ధి -బెంజ్

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల డిమాండ్ ప్రతినెలా బలమైన వృద్ధి సాధిస్తోందని దేశీయ అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల పాటు రెండంకెల వృద్ధి తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో గతేడాది స్థాయి అమ్మకాలను అందుకోగలమని కంపెనీ భావిస్తోంది. జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ మొత్తం 2,058 కార్లను విక్రయించినట్టు బుధవారం ప్రకటించింది. ఇది ఏడాది ప్రాతిపదిక 38.5 శాతం క్షీణించినట్టు పేర్కొంది. అదేవిధంగా […]

Update: 2020-10-14 11:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: లగ్జరీ కార్ల డిమాండ్ ప్రతినెలా బలమైన వృద్ధి సాధిస్తోందని దేశీయ అతిపెద్ద లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ వెల్లడించింది. జులై-సెప్టెంబర్ మధ్య మూడు నెలల పాటు రెండంకెల వృద్ధి తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికంలో గతేడాది స్థాయి అమ్మకాలను అందుకోగలమని కంపెనీ భావిస్తోంది.

జులై-సెప్టెంబర్ మధ్య కాలంలో కంపెనీ మొత్తం 2,058 కార్లను విక్రయించినట్టు బుధవారం ప్రకటించింది. ఇది ఏడాది ప్రాతిపదిక 38.5 శాతం క్షీణించినట్టు పేర్కొంది. అదేవిధంగా జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో మొత్తం 5,007 యూనిట్లను విక్రయించామని, ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం భారీ క్షీణత అని కంపెనీ తెలిపింది. అయితే, సెప్టెంబర్ నెలలో కార్ల అమ్మకాలు కరోనాకు ముందునాటి స్థాయిలో 85 శాతాన్ని సాధించాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మార్టిన్ స్వెంక్ చెప్పారు.

అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో అమ్మకాలు మరింత వృద్ధిని సాధిస్తాయని, ఇది 2020లో కరోనా మహమ్మారికి ముందున్న అంచనాలను దాటి నమోదవుతాయని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు. ‘సెప్టెంబర్ త్రైమాసికంలో సాధించిన రెండంకెల వృద్ధి పట్ల సంతృప్తిగా ఉన్నామని, రానున్న నెలల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ ఇదే స్థాయి అమ్మకాల వృద్ధిని కొనసాగించగలమని విశ్వసిస్తున్నట్టు’ మార్టిన్ స్వెంక్ చెప్పారు.

Tags:    

Similar News