ఢిల్లీలో భూకంపం

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. నెలలోపే ఇలా భూమి కంపించడం ఇది మూడోసారి. తాజాగా, సంభవించిన భూకంప కేంద్రాన్ని ఢిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతంలోని 15కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.45గా నమోదైనట్టు వెల్లడించారు. ఈ ప్రకంపనల్లో ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, అందరూ క్షేమంగా […]

Update: 2020-05-10 05:34 GMT

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో ఆదివారం మధ్యాహ్నం స్వల్పంగా భూమి కంపించింది. నెలలోపే ఇలా భూమి కంపించడం ఇది మూడోసారి. తాజాగా, సంభవించిన భూకంప కేంద్రాన్ని ఢిల్లీ-యూపీ సరిహద్దు ప్రాంతంలోని 15కిలోమీటర్ల లోతులో గుర్తించినట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 1.45గా నమోదైనట్టు వెల్లడించారు. ఈ ప్రకంపనల్లో ఎలాంటి ఆస్థి, ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. దీనిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఢిల్లీలో భూ ప్రకంపనలు వచ్చాయనీ, అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఏప్రిల్ 12, 13 తేదీల్లోనూ 3.5, 2.7 తీవ్రతలతో ప్రకంపనలు నమోదైనట్టు తెలిపారు.

Tags:    

Similar News