హైదరాబాద్ వాసులకు షాక్.. సరుకు లేదంటున్న క్రాకర్ మార్కెట్లు

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఇప్పుడు క్రాకర్స్ కొరత వేదిస్తోంది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి కూడా పండుగ పై అనుమానాలు పెరిగాయి. దాంతో ఉత్పత్తి దారులు కూడా అంతంత మాత్రంగానే ఉత్పత్తి చేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చాలా అడ్డంకులు ఉండటంతో అమ్మకపు దారులు కూడా తక్కువ సరుకునే మార్కెట్ లోకి తీసుకు వచ్చారు. అమ్మకపు సమయం తక్కువ ఉండటం, నగరంలో క్రాకర్స్ కాల్చడం […]

Update: 2021-11-04 03:54 GMT

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్ లో ఇప్పుడు క్రాకర్స్ కొరత వేదిస్తోంది. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సారి కూడా పండుగ పై అనుమానాలు పెరిగాయి. దాంతో ఉత్పత్తి దారులు కూడా అంతంత మాత్రంగానే ఉత్పత్తి చేశారు. అంతేకాకుండా సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం చాలా అడ్డంకులు ఉండటంతో అమ్మకపు దారులు కూడా తక్కువ సరుకునే మార్కెట్ లోకి తీసుకు వచ్చారు. అమ్మకపు సమయం తక్కువ ఉండటం, నగరంలో క్రాకర్స్ కాల్చడం పై అక్కడక్కడా ఆంక్షలు ఉండటంతో పాటు, రాత్రి 10 తర్వాత కాల్చకూడదు అనే నిబంధనలు ఉండటంతో నిర్వహకులు తక్కువ సరుకును తీసుకువచ్చారు.

మార్కెట్ లో సరుకు తక్కువగా ఉండటంతో డిమాండ్ బాగా పెరిగింది. ఇంకేముంది అమాంతం క్రాకర్స్ ధరలు ఆకాశాన్ని తాకాయి. పోయిన సారి కంటే దాదాపు 20 శాతం ధరలు పెరిగాయి. ఇక కొనుగోలు దారులు బారులు తీరుతుండటంతో మార్కెట్ లో అమ్మకపు దారులు కొత్త సరుకు తేవడానికి నానా పాట్లు పడుతున్నారు.

Tags:    

Similar News