షాకింగ్ వీడియో.. నా కూతురినే ప్రేమిస్తావా.. నడిరోడ్డుపై సుత్తి, ఇనుప రాడుతో..

దిశ, వెబ్‌డెస్క్ : తన కూతురిని ఓ యువకుడు ప్రేమించాడని.. సదరు యువతి.. తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇనుప సుత్తి, రాడుతో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22), మక్సి నగరానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి […]

Update: 2021-09-14 00:59 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తన కూతురిని ఓ యువకుడు ప్రేమించాడని.. సదరు యువతి.. తండ్రి, సోదరుడు దారుణానికి ఒడిగట్టాడు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఇనుప సుత్తి, రాడుతో దాడి చేశారు. ఈ షాకింగ్ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాజాపూర్‌ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పుష్పక్ భావ్సర్(22), మక్సి నగరానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారు.

వీరిద్దరూ తల్లిదండ్రులకు చెప్పకుండా ఇళ్ల నుంచి పారిపోయారు. అనంతరం యువతి తల్లిదండ్రులు, పెద్దలు వారిని ఇంటికి రావాలని కోరారు. ఈ క్రమంలో వారు తమ ఇళ్లకు తిరిగి వచ్చారు. అయితే ముందు నుంచి యువతి కుటుంబ సభ్యులకు పుష్పక్ అంటే ఇష్టం లేదు. ఈ నేపథ్యంలో ఆదివారం పుష్పక్‌ కటింగ్‌ షాప్‌లో కటింగ్‌ చేసుకుంటున్న సమయంలో యువతి తండ్రి, అన్న ఒక్కసారిగా షాప్‌ నుంచి అతన్ని బయటకు లాక్కొచ్చారు.

మక్సీ వీధిలో వెంబడించి మరీ సుత్తి, ఇనుప రాడ్‌తో పుష్పక్‌పై దారుణంగా దాడి చేశారు. ఈ దాడిలో పుష్పక్‌ కాలు, చేతికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాడి అనంతరం యువకుడి తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. యువతి తండ్రి, అన్నపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడిపై దాడి చేసిన వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

Tags:    

Similar News