విమాన రాకపోకలపై ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: భారత్, యూకేల మధ్య విమాన రాకపోకలపై ఈ నెల 8వ తేదీ నుంచి ఆంక్షలు సడలనున్నాయి. ఉభయ దేశాలకు చెందిన ఒక్కో విమానయాన సంస్థ వారానికి కేవలం 15 విమానాలను మాత్రమే నడపాల్సి ఉంటుంది. 23వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఆ విమానాలు కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి మాత్రమే నడుస్తాయని తెలిపారు. యూకేలో కొత్త రకం […]
న్యూఢిల్లీ: భారత్, యూకేల మధ్య విమాన రాకపోకలపై ఈ నెల 8వ తేదీ నుంచి ఆంక్షలు సడలనున్నాయి. ఉభయ దేశాలకు చెందిన ఒక్కో విమానయాన సంస్థ వారానికి కేవలం 15 విమానాలను మాత్రమే నడపాల్సి ఉంటుంది. 23వ తేదీ వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి వెల్లడించారు. ఆ విమానాలు కూడా ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, హైదరాబాద్ల నుంచి మాత్రమే నడుస్తాయని తెలిపారు. యూకేలో కొత్త రకం కరోనా రిపోర్ట్ కావడంతో ఆ దేశం నుంచి గతనెల 23 నుంచి విమానరాకపోకలపై కేంద్రం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 7వ తేదీ వరకు నిషేధం అమలవనుంది. అనంతరం దశలవారీగా ఆంక్షలను సడలించడానికి కేంద్రం నిర్ణయించింది.