లాక్ డౌన్ అంతా ఉత్తిదే..!
దిశ, నాగర్ కర్నూల్ : కరోనా వైరస్ నియంత్రణకై ఏకైక అస్త్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. వైరస్ సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతులను కాపాడుకోవడం లాక్ డౌన్ ప్రధాన లక్ష్యం. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 10గంటల నుండి తిరిగి ఉదయం 6వరకు లాక్ డౌన్ నిబంధనలు విధించింది. 6 నుండి 10వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇచ్చారు. ఈ నాలుగు గంటల సడలింపుతో 20గంటల శ్రమ పూర్తిగా […]
దిశ, నాగర్ కర్నూల్ : కరోనా వైరస్ నియంత్రణకై ఏకైక అస్త్రంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. వైరస్ సోకిన వ్యక్తి నుండి ఆరోగ్యవంతులను కాపాడుకోవడం లాక్ డౌన్ ప్రధాన లక్ష్యం. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉదయం 10గంటల నుండి తిరిగి ఉదయం 6వరకు లాక్ డౌన్ నిబంధనలు విధించింది. 6 నుండి 10వరకు నిత్యావసర సరుకుల కొనుగోలుకు సడలింపు ఇచ్చారు.
ఈ నాలుగు గంటల సడలింపుతో 20గంటల శ్రమ పూర్తిగా వృధా అవుతోందని ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినం చేసినట్లు ప్రకటించారు. ఉదయం 9:45నుండే కఠినంగా అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చినా నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో మాత్రం 11గంటలైనా ప్రజలు రోడ్లపైనే స్వేచ్ఛగా తిరుగుతున్నారు. దుకాణాల ముందు కనీస భౌతిక దూరం కూడా కనిపించకపోవడం గమనార్హం.