లాక్‌డౌన్ రూల్స్ కఠినంగా అమలు చేయండి
దిశ, మెదక్ : సిద్దిపేట పట్టణంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కమిషనర్ జోయల్ డేవి స్ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్, అంబేద్కర్ సర్కిల్, కరీంనగర్ రోడ్డు, సుభాష్ రోడ్, తదితర ప్రదేశాలను సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణ కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు […]
దిశ, మెదక్ :
సిద్దిపేట పట్టణంలో లాక్‌డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని కమిషనర్ జోయల్ డేవి స్ఆదేశించారు. మంగళవారం సిద్దిపేట పట్టణంలోని మెదక్ రోడ్, అంబేద్కర్ సర్కిల్, కరీంనగర్ రోడ్డు, సుభాష్ రోడ్, తదితర ప్రదేశాలను సీపీ సందర్శించారు. ఈ సందర్భంగా జోయల్ డేవిస్ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నివారణ కోసం పటిష్ఠమైన చర్యలు చేపట్టాలన్నారు. లాక్‌డౌన్ మే 3 వరకు పొడిగించిన నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో అన్ని చౌరస్తాల్లో వాహనాల తనిఖీలు చేపట్టాలన్నారు. అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చే వాహనాలను సీజ్ చేయాలన్నారు. నిత్యావసర సరుకుల దుకాణాలు మినహా ఇతర షాపులు తెరిచి ఉంటే సీజ్ చేసి కేసులు పెట్టాలన్నారు. మోటార్ సైకిల్‌పై ఇద్దరు వెళ్లినా, ఎలాంటి పర్మిషన్ లేకుండా కారులో ఇద్దరి కంటే ఎక్కువ మంది ప్రయాణించినా సీజ్ చేయాలన్నారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు, కర్చీఫ్, రుమాలును ముఖానికి కట్టుకోవాలన్నారు.
Tags: corona, lockdown, rules implemented seriously, cp joyal davis