దేశంలో 6 నుంచి 8 వారాల పాటు లాక్‌డౌన్ తప్పనిసరి : ఐసీఎంఆర్

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. బుధవారం మీడియాతో సంభాషించిన ఆయన.. దేశంలోని 90శాతం ప్రాంతాల్లో అధికంగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో 18 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. భారత్ స్ట్రెయిన్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు. B.1.617 రకం స్ట్రెయిన్ భారత్ […]

Update: 2021-05-12 06:22 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ స్పందించారు. బుధవారం మీడియాతో సంభాషించిన ఆయన.. దేశంలోని 90శాతం ప్రాంతాల్లో అధికంగా పాజిటివిటీ రేటు ఉందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అన్ని రాష్ట్రాలు లాక్‌డౌన్ విధించడంతో 18 రాష్ట్రాల్లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయని పేర్కొన్నారు. భారత్ స్ట్రెయిన్ పై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) ఎలాంటి ప్రకటన చేయలేదని కేంద్ర మంత్రి స్పష్టంచేశారు.

B.1.617 రకం స్ట్రెయిన్ భారత్ దని WHO చెప్పలేదని క్లారిటీ ఇచ్చారు. అనంతరం ఐసీఎంఆర్ కీలక ప్రకటన చేసింది. దేశంలో కరోనా వైరస్ త్వరగా అదుపులోకి రావాలంటే ఆరు నుంచి 8 వారాల వరకు లాక్‌డౌన్ అమలు చేయాలని ప్రకటించింది. కరోనా వ్యాప్తి కట్టడికి లాక్డౌన్ తప్పనిసరి అని ఐసీఎంఆర్ తేల్చిచెప్పింది. దేశంలో పాజిటివిటీ రేటు పదిశాతం కంటే ఎక్కువ ఉన్న ప్రతిచోటా కఠినమైన లాక్ డౌన్‌ను అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

Tags:    

Similar News