గుంటూరు జిల్లాలో లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఆయా గ్రామాల పంచాయతీలు తీర్మానం చేశాయి. మరికొన్నిచోట్ల అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వారంపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎమ్మార్వో నాంచారయ్య నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఈ నెల 16వరకు కొల్లిపర మండలంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 […]
దిశ, వెబ్‌డెస్క్: కరోనా తీవ్రత పెరుగుతుండటంతో కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు స్వచ్చంధంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాల్లో లాక్‌డౌన్ విధిస్తూ ఆయా గ్రామాల పంచాయతీలు తీర్మానం చేశాయి. మరికొన్నిచోట్ల అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు.
తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో వారంపాటు లాక్‌డౌన్ విధిస్తూ ఎమ్మార్వో నాంచారయ్య నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి ఈ నెల 16వరకు కొల్లిపర మండలంలో లాక్‌డౌన్ విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు మాత్రమే వ్యాపారాలు నిర్వహించుకోవాలని, హోటల్స్, టీ స్టాల్స్ పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.