నాగపూర్‌లో పూర్తిస్థాయి లాక్‌డౌన్
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఇంకా తగ్గడం లేదు. పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. నాగ్‌పూర్‌లో ఈ నెల 15 నుంచి 21 వరకు పూర్థిస్ధాయి లాక్‌డౌన్ విధించినట్లు అధికారులు తెలిపారు. లాక్‌డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. కాగా దేశవ్యాప్తంగా చూసుకుంటే.. ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా త్వరలో లాక్‌డౌన్ విధించే […]
దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్రలో కరోనా ప్రభావం ఇంకా తగ్గడం లేదు. పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. దీంతో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అక్కడి అధికారులు లాక్‌డౌన్ విధిస్తున్నారు. నాగ్‌పూర్‌లో ఈ నెల 15 నుంచి 21 వరకు పూర్థిస్ధాయి లాక్‌డౌన్ విధించినట్లు అధికారులు తెలిపారు.
లాక్‌డౌన్ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. కాగా దేశవ్యాప్తంగా చూసుకుంటే.. ఒక్క మహారాష్ట్రలోనే ఎక్కువ కేసులు నమోదు అవుతున్నాయి. దీంతో మహారాష్ట్రవ్యాప్తంగా త్వరలో లాక్‌డౌన్ విధించే అవకాశాలున్నట్లు వార్తలొస్తున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోతే త్వరలో రాష్ట్రవ్యాప్తంగా లాక్‌డౌన్ విధిస్తామని సీఎం ఉద్దవ్ ఠాక్రే హెచ్చరించిన విషయం తెలిసిందే.