ప్రజల రక్షణ కోసమే లాక్ డౌన్ : పోచారం

దిశ, బాన్సువాడ : కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల రక్షణ కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యవసర సరుకుల కోసం […]

Update: 2021-05-11 09:15 GMT

దిశ, బాన్సువాడ : కరోనా వైరస్ రోజురోజుకు విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజల రక్షణ కోసమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నేటి నుండి 10 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ విధించనున్నట్లు ఆయన తెలిపారు. నిత్యవసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనాపై పోరులో ప్రజలు కలిసికట్టుగా ప్రభుత్వానికి, అధికారులకు సహకరించి, స్వచ్చందంగా ఇళ్లలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

Tags:    

Similar News