పశ్చిమ బెంగాల్‌లో జులై 31దాకా లాక్‌డౌన్

కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 31వరకూ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర యూనిట్ దిలీప్ ఘోష్, బీఎస్‌పీ నేత మనోజ్, సీపీఐ నుంచి స్వపన్ బెనర్జీ, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ భట్టాచార్యలు పాల్గొన్నారు. […]

Update: 2020-06-24 09:36 GMT

కోల్‌కతా: కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే నెల 31వరకూ లాక్‌డౌన్‌ను అమలు చేయనున్నట్టు మమతా బెనర్జీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కోల్‌కతాలో సీఎం మమతా బెనర్జీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర యూనిట్ దిలీప్ ఘోష్, బీఎస్‌పీ నేత మనోజ్, సీపీఐ నుంచి స్వపన్ బెనర్జీ, కాంగ్రెస్ నుంచి ప్రదీప్ భట్టాచార్యలు పాల్గొన్నారు. అనంతరం, లాక్‌డౌన్ పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. సమావేశంలో భిన్న వాదనలు రావడంతో తుదకు ప్రస్తుత మినహాయింపులతో లాక్‌డౌన్‌ను వచ్చే నెల 31వరకు పొడిగించనున్నట్టు సర్కారు ప్రకటించింది. ఈ కాలంలో ట్రైన్, మెట్రో సర్వీసులను పునరుద్ధరించబోదని తెలిపింది. పాఠశాలలు, ఇతర విద్యా సంస్థలు కూడా మూసివేసే ఉంటాయని పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో అన్‌లాక్1 అమలవుతున్నది. అన్‌లాక్1 ఈ నెల 30 దాకా అమలుకానున్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News