భూముల రిజిస్ట్రేషన్లకు ‘లాక్‌డౌన్’ బ్రేక్
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ’లాక్‌డౌన్ ’ నిర్ణయం నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు మినహాయింపు లభించలేదు. అన్ని వ్యాపార సంస్థల లాగానే భూముల క్రయ విక్రయాలు కూడా బంద్ కానున్నాయి. లాక్‌డౌన్ ఉన్నంతకాలం రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మూతబడనుంది. మొత్తం భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. గతేడాది లాక్‌డౌన్ కారణంగా, ఆ తర్వాత ’ధరణి’ కారణంగా కుదలైన భూముల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జనవరి నుంచి పుంజుకున్నాయి. ఏప్రిల్ నెలలో సుమారు […]
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ’లాక్‌డౌన్ ’ నిర్ణయం నుంచి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు మినహాయింపు లభించలేదు. అన్ని వ్యాపార సంస్థల లాగానే భూముల క్రయ విక్రయాలు కూడా బంద్ కానున్నాయి. లాక్‌డౌన్ ఉన్నంతకాలం రాష్ట్రవ్యాప్తంగా స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ మూతబడనుంది. మొత్తం భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోనున్నాయి. గతేడాది లాక్‌డౌన్ కారణంగా, ఆ తర్వాత ’ధరణి’ కారణంగా కుదలైన భూముల రిజిస్ట్రేషన్లు ఈ ఏడాది జనవరి నుంచి పుంజుకున్నాయి.
ఏప్రిల్ నెలలో సుమారు రూ. 717 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు ఆ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సుమారు రూ. 12000 కోట్లను ఆర్జించాలని రాష్ట్ర ప్రభుత్వ భావించింది. రాష్ట్ర బడ్జెట్‌లో సైతం అంతే స్థాయిలో అంచనా వేసింది. ఆ ప్రకారం ప్రతీ నెలా సగటున వెయ్యి కోట్ల రూపాయలు రావాలన్నది లక్ష్యం అయినా, ఇప్పటివరకు రూ. 800 కోట్లు (నెలవారీ) దాటలేదు. ఇప్పుడు ’లాక్‌డౌన్’తో మళ్ళీ ఆ శాఖ ఆదాయానికి బ్రేక్ పడింది.