లాక్ డౌన్.. లైఫ్‌లో బెస్ట్ పార్ట్: రష్మిక
ఛలో సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన.. సూపర్ సక్సెస్ అందుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకుని.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టిన లిల్లీ “సరిలేరు నీకెవ్వరు” తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత తన తొలి సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములు డైరెక్షన్ లో నితిన్ తో “భీష్మ” చేసి సూపర్‌హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన […]
ఛలో సినిమాతో తెలుగునాట అడుగుపెట్టిన కన్నడ భామ రష్మిక మందన.. సూపర్ సక్సెస్ అందుకుంది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు పర్ఫెక్ట్ హీరోయిన్ అనిపించుకుని.. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో జతకట్టిన లిల్లీ “సరిలేరు నీకెవ్వరు” తో బ్లాక్ బస్టర్ అందుకుంది. ఆ తర్వాత తన తొలి సినిమా డైరెక్టర్ వెంకీ కుడుములు డైరెక్షన్ లో నితిన్ తో “భీష్మ” చేసి సూపర్‌హిట్ అందుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన “పుష్ప” సినిమాలో కీలక పాత్ర చేస్తున్న రష్మిక.. లాక్ డౌన్ తో జీవితంలో చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నానని చెప్తోంది.
నాకు 18 ఏళ్ల వయసు నుంచి పరిశీలిస్తున్న నా లైఫ్ మారథాన్ లా ఎప్పుడూ పరుగులు పెడుతూనే ఉందని చెప్తోంది రష్మిక. హా.. ఇప్పుడు ఫినిషింగ్ పాయింట్ కు చేరుకున్న అనుకునే లోపే మళ్లీ పరుగు ప్రారంభించాల్సి వస్తోందని అంటోంది. అలాగని నేను కంప్లైంట్ చేస్తున్నా అనుకునేరు.. ఇది నాకు కూడా ఇష్టమే అంటున్న ఈ భామ.. స్కూల్ నుంచి కాలేజ్ కంప్లీట్ చేసే వరకు హాస్టల్ లోనే ఉందట. అప్పుడు మా అమ్మానాన్న చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు అనుకునేదట. కానీ అదే వాళ్ల ప్రేమ అని తర్వాత అర్థం అయిందట. షూటింగ్ టైమ్ లో అమ్మ రాత్రంతా నాతోనే సెట్‌లో గడపడం.. నాన్న అనవసర మీటింగ్ లకు బై చెప్పి ఫ్యామిలీ తో స్పెండ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపించడం, నా చిన్ని చెల్లి తన చుట్టూ ఉన్న సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రయత్నించడం నాకు ఇంకా గుర్తుంది. కుటుంబంతో గడిపే సమయం చాలా తక్కువ కాగా.. లాక్ డౌన్ వల్ల రెండు నెలలకు పైగా ఇంట్లో గడపడం నా లైఫ్ లో బెస్ట్ పార్ట్ అంటోంది లిల్లీ. ఇప్పుడు ఇంట్లో పని గురించి మాట్లాడుకోవడం లేదు. నా గురించి అమ్మానాన్న కేర్ తీసుకోవడం చాలా బాగా నచ్చుతుందని చెప్తోంది. ఫైనల్ గా నా తల్లిదండ్రులు నాకిచ్చిన బలం లైఫ్ లో ప్రతీ సమస్యను ఎదుర్కోవడం అంటున్న రష్మిక.. నేను నిజంగా అనుకోలేదు ఇంత ప్రశాంతమైన, సంతోషకరమైన రోజులు ఇంట్లో గడుపుతానని .. కుటుంబమే ఇల్లు.. మీరు రోజంతా కష్టపడి ఇంటికి చేరుకున్నప్పుడు ఇంట్లో ప్రశాంతత దొరికిందంటే మీ కన్నా అదృష్టవంతులు మరొకరు లేరన్న విషయం గుర్తుంచుకోమని చెప్తోంది.
https://www.instagram.com/p/CAvVRo7JlCj/?igshid=13tpbloo6yjax