జీహెచ్ఎంసీ అధికారులపై స్థానికుల దాడి
దిశ, వెబ్‌డెస్క్: అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులకు స్థానికులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఒక్కసారిగా ఎదురుతిరిగారు. తమ కట్టడాలను కూల్చివేయడానికి వస్తారా అంటూ అధికారులపై దాడి చేశారు. ఓ కారును ధ్వంసం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది. అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని చందానగర్‌లో అక్రమ నివాసాలను గుర్తించిన అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జీహెచ్ఎంసీ […]
దిశ, వెబ్‌డెస్క్: అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు వెళ్లిన అధికారులకు స్థానికులు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఒక్కసారిగా ఎదురుతిరిగారు. తమ కట్టడాలను కూల్చివేయడానికి వస్తారా అంటూ అధికారులపై దాడి చేశారు. ఓ కారును ధ్వంసం చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటన ఉద్రిక్తత వాతావరణానికి దారితీసింది.
అక్రమ కట్టడాలను కూల్చివేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని చందానగర్‌లో అక్రమ నివాసాలను గుర్తించిన అధికారులు కూల్చివేతకు రంగం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలోనే శుక్రవారం జీహెచ్ఎంసీ అధికారులు పనుల పరిశీలన కోసం అక్కడికి వెళ్లారు.
అయితే, అక్రమ కూల్చివేతను ఖండించిన స్థానికులు అధికారులపై దాడి చేశారు. అలాగే, టౌన్ ప్లానింగ్ అధికారి కారును ధ్వంసం చేశారు. స్థానికుల దాడితో వెనుదిరిగిన జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమపై దాడి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.