బెజవాడ టీడీపీలో చిచ్చు.. పార్టీ మారుతారా?

విజయవాడ టీడీపీలో చిచ్చు రేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆ పార్టీలో విభేదాలకు కారణమైంది. విజయవాడ మున్సిపల్ స్థానానికి బరిలో తాను దిగుతానంటే తానే దిగుతానంటూ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పోటీ పడడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా అనుచరుడు, మాజీ మేయర్ ఇద్దరూ నామినేషన్ దాఖలు చేయడం విశేషం. బోండా అనుచరుడ్ని మేయర్ వెనక్కి తగ్గమని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో […]

Update: 2020-03-13 06:34 GMT

విజయవాడ టీడీపీలో చిచ్చు రేగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల కేటాయింపు ఆ పార్టీలో విభేదాలకు కారణమైంది. విజయవాడ మున్సిపల్ స్థానానికి బరిలో తాను దిగుతానంటే తానే దిగుతానంటూ మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు పోటీ పడడం వివాదానికి కారణమైంది. ఈ నేపథ్యంలో సెంట్రల్ నియోజకవర్గం నుంచి బొండా అనుచరుడు, మాజీ మేయర్ ఇద్దరూ నామినేషన్ దాఖలు చేయడం విశేషం.

బోండా అనుచరుడ్ని మేయర్ వెనక్కి తగ్గమని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరిలో ఎవరో ఒకరు వైఎస్సార్సీపీలోకి వెళ్లే అవకాశముందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో పార్టీ వర్గాలు రంగంలోకి దిగి ఇద్దరితో మంతనాలు జరుపుతున్నాయి. మరోవైపు ఈ ప్రాంతంలో క్షత్రియుల ప్రాబల్యం ఎక్కువగా ఉందని, క్షత్రియులకు ఒక్క సీటు కూడా కేటాయించని నేపథ్యంలో తమకు కేటాయించాలని ఆ సామాజిక వర్గం డిమాండ్ చేస్తోంది.

Tags: local body elections, vijayawada, municipal election, mayor seat, ex mayor, bonda followers

Tags:    

Similar News