ఎల్‌ఎండీ గేట్లు ఎత్తివేత..

దిశ ప్రతినిది, కరీంనగర్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంలో వరదనీరు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నందున 23 టీఎంసీలకు నీటిమట్టం చేరుకోగానే అదికారులు డ్యాం గేట్లను ఎత్తాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఎల్‌ఎండీ 3 గేట్లను ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అంతకుముందు, మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలను […]

Update: 2020-08-22 08:07 GMT

దిశ ప్రతినిది, కరీంనగర్ : రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేర్ డ్యాంలో వరదనీరు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి మరింత వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నందున 23 టీఎంసీలకు నీటిమట్టం చేరుకోగానే అదికారులు డ్యాం గేట్లను ఎత్తాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలోనే శనివారం ఎల్‌ఎండీ 3 గేట్లను ఎత్తి 6 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదిలారు. అంతకుముందు, మానేరు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్ స్విచ్ ఆన్ చేయగా.. నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, సీపీ కమలాసన్ రెడ్డి, మేయర్ సునీల్ రావు, ఎస్‌ఈ శివకుమార్ పాల్గొన్నారు.

Tags:    

Similar News