ఒకరితో సహజీవనం.. మరొకరితో అక్రమ సంబంధం

దిశ, వెబ్‌డెస్క్ : తనతో సహజీవనం చేస్తూనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళను, ఆమె కుమార్తెను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేస్తూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజస్థాన్‌కు చెందిన సంజయ్ సింగ్‌(37) ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం తన ఇంటి సమీపంలో నివసించే మహిళ(41)తో పరిచయం ఏర్పడింది. […]

Update: 2021-02-15 11:55 GMT

దిశ, వెబ్‌డెస్క్ : తనతో సహజీవనం చేస్తూనే మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తిని ప్రశ్నించిన మహిళను, ఆమె కుమార్తెను దారుణంగా హత్య చేశాడో దుర్మార్గుడు. ఇద్దరు పిల్లల తల్లి అయిన ఆమెతో పదేళ్లుగా సహజీవనం చేస్తూనే ఈ దారుణానికి పాల్పడ్డాడు. గుజరాత్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్‌కు చెందిన సంజయ్ సింగ్‌(37) ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. పదేళ్ల క్రితం తన ఇంటి సమీపంలో నివసించే మహిళ(41)తో పరిచయం ఏర్పడింది. ఆమెకు, భర్తకు మధ్య విభేధాలు రావడంతో తన ఇద్దరి కూతళ్లను తీసుకోని సంజయ్ సింగ్‌తో కలిసి ఉంటుంది. ఈ ఇద్దరు పెళ్లి చేసుకోకుండా 2009 నుంచి సహజీవనం చేస్తున్నారు. ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లా గాంధీధామ్‌కు వచ్చి స్థిరపడ్డారు.

ఇటీవల కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య చిన్నచిన్న తగాదాలు జరుగుతున్నాయి. సంజయ్ సింగ్‌ కొంతకాలంగా మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. విషయం తెలుసుకున్న సదరు మహిళ సింగ్‌ను ప్రశ్నించడంతో వివాదాలు చెలరేగాయి. ఈ క్రమంలో సంజయ్ సింగ్‌ ఫిబ్రవరి 12న ఆమెను, చిన్న కుమార్తె(13)ను తన బైక్‌పై గ్రామ సమీపంలోని అడవికి తీసుకెళ్లాడు. అక్కడ కర్రతో వారిద్దరిపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. తల్లీకూతురు తలపై బలంగా మోదడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆ తర్వాత మృతదేహాలను సమీపంలోని మురుగు కాల్వలో పడేసి వెళ్లిపోయాడు.

తల్లీ, చెల్లి కనిపించక పోవడంతో ఆమె పెద్ద కుమార్తె(20) గాంధీధామ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన గాంధీధాం “బి” డివిజన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎస్ఎస్ దేశాయ్.. దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఆదివారం టీనేజ్ బాలిక మృతదేహాన్ని వెలికి తీయగా, గాంధీధామ్ నగరానికి సమీపంలో ఉన్న మురుగునీటి లైన్ నుంచి ఆమె తల్లి మృతదేహం సోమవారం వెలికితీశారు. సంజయ్ సింగ్‌పై హత్య నేరం కేసునమోదు చేసి, అరెస్ట్ చేసినట్లు ఇన్‌స్పెక్టర్ ఎస్ఎస్ దేశాయ్ చెప్పారు.

కాపురంలో నిప్పులు పోసిన కానిస్టేబుల్

Tags:    

Similar News