లిటిల్ బాయ్ బిగ్ హార్ట్.. కొవిడ్ పేషెంట్ల కోసం లైబ్రరీ

దిశ, ఫీచర్స్ : క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే కొందరిలోని అసలైన సామర్థ్యాలు బయటపడతాయి. ఆపదలో ఉన్నవారికి ఏదో విధంగా సాయపడి సంక్షోభాన్ని తగ్గించేందుకు వారు తమ వంతుగా ప్రయత్నిస్తుంటారు. తద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తుంటారు. అనైక్ సచ్‌దేవ్ అనే 9 ఏళ్ల బాలుడు కూడా కొవిడ్ పేషెంట్ల కోసం ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు. ఇటీవలే ఎల్లెన్ డిజెనెరస్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరైన అనైక్.. తను ప్రారంభించిన […]

Update: 2021-12-06 02:53 GMT

దిశ, ఫీచర్స్ : క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడే కొందరిలోని అసలైన సామర్థ్యాలు బయటపడతాయి. ఆపదలో ఉన్నవారికి ఏదో విధంగా సాయపడి సంక్షోభాన్ని తగ్గించేందుకు వారు తమ వంతుగా ప్రయత్నిస్తుంటారు. తద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చేందుకు కృషి చేస్తుంటారు. అనైక్ సచ్‌దేవ్ అనే 9 ఏళ్ల బాలుడు కూడా కొవిడ్ పేషెంట్ల కోసం ఉచిత లైబ్రరీ ఏర్పాటు చేసి అందరి మన్ననలు అందుకుంటున్నాడు.

ఇటీవలే ఎల్లెన్ డిజెనెరస్ టాక్ షోకు గెస్ట్‌గా హాజరైన అనైక్.. తను ప్రారంభించిన ‘అనైక్స్ లవింగ్ లైబ్రరీ’ గురించి మాట్లాడాడు. కొవిడ్ పేషెంట్ల కోసం తను సృష్టించిన లైబ్రరీ.. ఐసోలేటెడ్ పరిస్థితుల్లో లోన్లీనెస్ అనుభవిస్తున్న వారికి ఆ ఫీలింగ్‌ను తగ్గించడంలో సాయపడుతుందని చెప్పాడు. ప్రస్తుతానికి అనైక్.. సర్కిల్ టు సిటీ అనే NGOకు మద్దతుగా విరాళాలు సేకరించేందుకు పని చేస్తున్నాడు. ఇందుకోసం ర్యాప్ వీడియోలను అప్‌లోడ్ చేస్తూ వీక్షకులను ఆకట్టుకోవడం ద్వారా విరాళాలు కలెక్ట్ చేస్తున్నాడు.

అయితే అతని ఈ మిషన్ వెనుక బలమైన కారణం ఉంది. తన గ్రాండ్ మదర్‌కు కొవిడ్ సోకినపుడు ఆమె పరిస్థితిని దగ్గరి నుంచి చూసిన అనైక్.. ఆ టైమ్‌లో రోగులకు మానసిక సౌలభ్యం ఎంత అవసరమో గ్రహించి లైబ్రరీ ప్రారంభించాడు. ఈ సంగతి పక్కనబెడితే ఇప్పుడు నిరాశ్రయుల కోసం విరాళాలు సేకరించేందుకు కృషి చేస్తున్నాడు.

కాగా ఈ బాలుడి వీడియోలు, లైబ్రరీ గురించి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. ఇంత చిన్న వయసులో ఉన్నతంగా ఆలోచించి చాలా మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడని ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News