రాయి విసరడానికి తయారుగా వున్న
ఏకాకి బాలుడి పైనా
నీ సైనిక బలగాలు,
నీ ఫైటరు విమానాలు,
నీ యుద్ధ టాంకులు...
ఆ బాలుని నేత్రాల్లో
సూర్యుడు జ్వలిస్తున్నాడు.
అతని చిరునవ్వులో
వెన్నెల కురుస్తున్నది!
నాకు ఆశ్చర్యంగా ఉంది!
ఎవరు బలహీనులు
ఎవరు శక్తివంతులు
ఎవరు ఒప్పు ఎవరు తప్పు
సత్యానికే నోరువుండాలని కోరుకుంటా.
(సామి యూసుఫ్, బ్రిటిష్ గాయకుడు, కవి రాసిన కవితకు అనువాదం)
-కొత్తపల్లి రవిబాబు