మడిని అమ్మ ఒడిగ నెంచి
రాత్రి, పగలు యని తేడాలెంచక
విషకీటకాల లెక్కజేయక
ఎండకి ఒడిగిల పడి, వానకు నానుతూ పంటకై
ఆరేళ్ల కాలం ప్రయాసపడే కష్ట జీవి
అందరికీ బువ్వ పెట్టే వ్యవసాయధారి
అన్నదాత గూర్చి తెలియాలంటే
పంచభూతాలనడుగు,సూర్యచంద్రులనడుగు
అడుగు అడుగు..... గాలి నడుగు
రైతు గుండెలోని బాధలెన్నో,
నీరునడుగు
రైతు కనుల ప్రవహించిన క్షణములెన్నొ,
అగ్నినడుగు
రైతు ఉధరంలో కొలువుదీరిన వేలలెన్నొ,
పుడమినడుగు
రైతు స్వేదం తనని ముద్దాడిన రోజులెన్నొ,
ఆకాశాన్నడుగు
రైతు తనకేసి చూసిన సందర్భాలెన్నో,
సూరీడినడుగు
రైతు అలసినా శ్రమించిన తరుణాలెన్నొ,
చందురుడినడుగు
రైతు నిదురించని రాత్రులెన్నో,
ఎన్నో, ఎన్నెన్నో
రైతన్న కష్టానికి తలవంచిన కాలాలెన్నో......
నారోజు రంజిత్ కుమార్
ఫీల్డ్ ఆఫీసర్, కెడిసిసి బ్యాంక్