
చీకట్లో వెళ్తున్నప్పుడు
బ్యాటరీ వెలుగుతో పోవచ్చు
వర్షంలో వెళ్తున్నప్పుడు
గొడుగుతో పోవచ్చు
గుట్టల్లో పుట్టల్లో వెళ్తున్నప్పుడు
కర్రతో పోవచ్చు రక్షణ కోసం
ప్రజాప్రతినిధి లెక్క తప్పి
విచారణకి వెళ్తున్నప్పుడు
న్యాయవాదితో పోవచ్చు
రాజ్యాంగ భక్షణ కోసం
దొంగల్ని దొరలుగా ఆర్థిక నేరగాళ్లని
అమాయకులుగా చిత్రించడానికి
నిజం భద్రం కావాలి సుమా
అవినీతిపరుల ఆశలు చిధ్రం కావాలి
కర్మఫలితం కలియుగంలో
శాస్త్రం అవుతుందా
శాపం అవుతుందా
- కోటం చంద్రశేఖర్
94920 43348