
ఒడిలో జారిన అమృతమా,
నీ చిరునవ్వే లోకానికి వెలుగు!
నిన్ను పోషించే చేతులే,
నీ ప్రాణం తీశాయంటే?
పుట్టిన వాడు పెంచలేనని,
పోటీ ప్రపంచంలో నిలబెట్టలేనని,
తల్లి ఒడిలో చెమ్మగిల్లి,
బాల్యమే బలిపశువైపోయిందా?
స్వప్నాలను ఎండగట్టిన
కఠిన సమాజం ఎంత దుర్మార్గం!
బిడ్డల కన్నీటి చరిత్ర,
మళ్లీ రాయొద్దని అడుగుతున్నాను!
తల్లి ఒడిలోనే భద్రత లేక,
తండ్రి చేతుల్లో శరణం దొరకక,
నిజంగా భూమి తల్లికే
ఈ లోకం భారమైపోయిందా?
"నీ పిల్లలను పోటీకి కాదు,
ప్రేమకు సిద్ధం చెయ్!
నువ్వు బతకాలసిందే బిడ్డా,
నీ వెలుగే ఈ లోకానికి బతుకు దీపం!"
- జ్యోతి మువ్వల
90080 83344