జంగిడి

Poem

Update: 2025-03-15 00:15 GMT
జంగిడి
  • whatsapp icon

అప్పటికి..

అడివి మా సేతుల్లో ఉండీది!

ఓ తునకాలు..

ఓ జంగిడితో.. అతగాడొచ్చేడు

ఒళ్లల్లా కళ్లున్న నులక మంచం మీద

జంగిడి పరిసీ.. అంగడన్నాడు!

తునకాలు ధర్మం తప్పదన్నాడు.

కళ్లు మూసుకొని నమ్మాలన్నాడు!

కళ్లు మూసుకున్నాం

తునకాలు అడివిని తూకమేసింది!

తీరా కళ్లు విప్పి సూద్దుమా..

యింకేటుంది?

అడివి అతగాడి సేతుల్లోకెలిపోయింది.

అంగట్లో జంగిడి మాకు మిగిలింది!!

(తునకాలు : తక్కెడ,

జంగిడి వెడల్పాటి వెదురు జల్లెడ)

సిరికి స్వామినాయుడు

94940 10330 

Tags:    

Similar News

ఊరు

కష్టం