చెప్పలేని అణచివేత కథలను
చెవులు చూడనప్పుడు
ఆకాశంలో సగం స్వేచ్ఛాపతాకమై
రెపరెపలాడినప్పుడు
లింగ భేద సమానత్వ వేదన
నొప్పి అంతరించుగా
గుండె ప్రమిదలో ప్రేమ కొడిగట్టక,
జిగేలని విరబూసినప్పుడు
ప్రియజన గీతమై ఈ భూగోళం
స్వేచ్ఛారావాలను నృత్యించే వేళ
దేశ రక్తమెప్పుడు నిర్భయ నిర్మల
స్వేచ్ఛ వాయువుల పీల్చునో
ఎప్పుడామెను తన గర్భంలో
పొదివి అతడు పెంచునో
ఎప్పుడు అమ్మ ఆమె ఊపిరి
అతలాకుతలం కాదో
అప్పుడు సామరస్యం సమన్వయ
శబ్ద గోష్టి వర్ణాలై పరిఢవిల్లనీ
అక్కడ సుఖసంతోషాల ప్రేమ సంగీతం
విశాద బాధల గీతంతో పెనవేయులే
ఆమె దారి నడకల స్వేచ్ఛానలమై
అనువాదం
డా.టి.రాధా కృష్ణమాచార్యులు
98493 05871