సిగ్నేచర్

Poem

Update: 2024-09-08 18:45 GMT

నవాజ్ శబ్దగీతాల్ని

గాలి పలకరించింది!!

మేల్కొన్న కిరణాలన్నీ

మేఘాలలోనే రంగులదించుకొని

దిగాయి నేలను తాకెందుకు!!

గుంపులు గుంపులుగా

రెక్కల గాలి మూకుమ్మడిగా

గోపురం పైనున్న ధూళిని శుభ్రపరిస్తే

బంగారు నదిలా ధగధగలాడింది!!

విహారయాత్ర త్రికోణంలా

వీస్తూ కీరవాణి రాగాన్ని

కోయిలతో జతకట్టే గానాలెన్నో

మొద్దు బారిన సోమరి

చిటుక్కుమని కిటికీలోంచి

క్లిక్కుమని కెమెరాలో ఉంచితే

చూస్తున్న దృశ్యం మళ్లీ రేపు

ఇదే సమయానికి వస్తానంది

కుంచెతో చిత్రించి బంధిస్తే

అదే సంతకమై కూర్చుంది..

ఇక అంతే మొదలు

రెక్కల శబ్దం ఆగదు...

- అనిత చరణ్

94945 79069

Tags:    

Similar News

అమరత్వంపై