అమ్మా గోదారమ్మా…!

Poem

Update: 2024-09-08 18:45 GMT

అమ్మా గోదారమ్మ నీ ఉగ్రరూపం

వరద ఉధృతితో పొంగుతున్నది

పల్లె పట్టణం మునిగిపోయి

ఇల్లు పొలాలు చెట్టు చేమలు

గొడ్డు గోదలన్ని కొట్టుకపోయి

మా కన్నీళ్లన్నీ నీలో కలిసిపోయాయి...

ఇప్పుడు ఊర్లన్ని చెరువులుగా మారిపోయి

వాగులన్ని ఉపొంగుతున్నాయి

చెట్లను నరికి పొలాలను

రీయల్ ఎస్టేట్‌తో ముంచినది

రియల్టర్‌ల దందా కాదా..?

నెలలు నిండిన బిడ్డ

పురుడోసుకోను పుట్టింటికొచ్చిన

పురిటి నొప్పుల వేదనకు

మంత్రసానే దిక్కయిందా..?

డోలి, కావడి మోతలు తప్పలేదు

ఇంగ్లీష్ మందులు అందకుండానే

వరదల్లో ప్రసవించిన తల్లికి

గోదారమ్మ సాక్షిగా పండంటి బిడ్డ పుట్టినా

కండ్లనిండా చూడకుండానే

కన్నుమూసిన ఆ తల్లి

చావుకు కారకులెవరో....?

వంతెనలన్ని నీళ్ళతో కూలిన చోట

ఇండ్లన్ని పడవలై కదులుతున్నాయి..

పల్లె పట్టణాలన్ని చీకట్లో చిక్కుకొని.

బురుద మడుగుతో అలుకుపుతయింది

ఆకలి దప్పులతో అలమటించే ప్రజలకు

అందని ఆపన్న హస్తాలు ఎన్నో

ఆదుకోమంటూ ఆర్తితో వేడుకుంటున్న వాళ్ల

గొంతును తడపలేని గోదావరి కృష్ణమ్మలు

కరుణించి కాపాడుతాయా...?

ఈ విపత్కర స్థితికి కారకులు ఎవరో

జవాబు చెప్పమ్మా గోదావరి కృష్ణమ్మా...!

వంగల సంతోష్

95737 86539

Tags:    

Similar News

అమరత్వంపై