పలుకు మారినది..
పిలుపు మారినది..
భావితరాల బ్రతుకు మారుతున్నది..
ప్రియమైన మాతృభాష మరుగున పడుతున్నది..
తెలుగు నేలపై తెలుగు పలుకుటే నేరమంటున్నది..
విద్యాబుద్ధులు నేర్పే విద్యాలయాల్లోనే
ఈ వింత శిక్ష అమలవుతున్నది..
తల్లిదండ్రుల ప్రోత్సాహం
ఈ తెలివితక్కువ యాగానికి ఆర్జ్యమౌతున్నది..
అనురాగాలొలుకు తెలుగు అంతరించిపోతున్నది..
తెలుగుసీమలో వెలుగు కరువవుతున్నది..
తెలుసుకోలేని తెలుగువాడ
తెలియని భాషకై తపిస్తున్నది..
తనదైన తెలుగుభాషను మరుస్తున్నది..
మేలుకో మిత్రమా..
ఆంగ్లభాషపై అభిలాష వదులుకో నేస్తమా..
అవసరానికే ఆంగ్ల భాష..
అభ్యసించు లేదు తప్పన్నది..
తెలుగురాయల కీర్తి పొందిన
తెలుగుభాష మనది..
తెలుగు తెలిసిన వాళ్లతో
తెలుగులో సంభాషించుటకు..
వేయకు వెనకడుగన్నది..
(తెలుగులో మాట్లాడితే శిక్షార్హం అంటున్న పాఠశాలలు..పొరపాటున తెలుగు మాట్లాడితే పొట్టు పొట్టు కొడుతున్న ఉపాధ్యాయులు.. ఈ నేపథ్యంలో)
ఇంద్రజ గడిపర్తి
79931 02602