కుక్కర్లో కూడు వద్దొద్దంటావు
కుండలో వండితే బాగుందంటావు
మిక్సీలో వేస్తే రుచిలేదంటావు
రోట్లో దంచితే మంచిగుందంటావు
నాయిన నీవు పల్లెకు పో
నూలు పరుపుల మీద నిదుర రాదంటావు
నులక మంచం మీద కునుకొస్తదంటావు
సోఫా సెట్ల మీద కూసునలేవు
ఈతసాపలేస్తే ఇడువనే ఇడువవు
నాయిన నీవు పల్లెకు పో
దగ్గు ఆయాసమొస్తే దావఖానకు రమ్మంటే
కాషాయం తాగుతలే ఖర్చెందుకంటావు
ప్లాస్టిక్ గ్లాసుల నీళ్ళిస్తే పక్కకు దొబ్బేస్తవ్
రాగి గ్లాసుల నీళ్ళయితే రోగాలు రావంటవ్
నాయిన నీవు పల్లెకు పో
ఇప్పుడు నాయిన పల్లెకు పోడు
ఎందుకంటే మనుమలు మనుమరాల్లు
అవ్వ తాత అంటుండ్రు
కాకపోతే అప్పుడప్పుడూ పల్లెకెల్లొస్తడు
పిల్లలకు నాలుగు రేనిగ్గాయలు
ఓ రెండు సద్దకంకులు పిడికెడు శనిగ్గింజలు
తన తువాలులో మూటెగట్టుకుని రానీక
అందుకే శిఖర ఆకారం కాదు నాయిన
అగుపించని అద్బుత గగనం నాయిన
దిగువున కనిపించని నీలాకాశం
వినోద్ పవర్
వాట్సాప్ నుంచి సేకరణ