చెప్పు

poem

Update: 2024-06-23 18:30 GMT

రోజూ వేసుకునేవే

కానీ ఈ రోజు ఎందుకో

చెప్పులు ముద్దొస్తున్నాయి

ఒకటికి రెండు మార్లు తుడిచి

చిన్నగా మరకలుంటే

తడిగుడ్డతో మరీ తుడిచి

రోజూ విసురుగా వేసుకునే వాటిని

నెమ్మదిగా నేలపై వుంచి వేసుకుని

మెత్తగా మెల్లగా నడిచాను

విసిరినది

నా చెప్పు కాకపోవచ్చు

కానీ అప్పుడు

ఆ మొఖంలో

వచ్చిన కంగారు చూసి

ఏ చెప్పును చూసినా

ఆ చెప్పులాగే కనిపిస్తోంది

ఆ విసిరిన గుండెకు

అలాయి బలాయ్

చెప్పాలనుంది

ఆ చేతిని తాకి

ముద్దాడాలని ఉంది.

(వారణాశి సంఘటన ప్రేరణగా)

కెక్యూబ్ వర్మ

94934 36277

Tags:    

Similar News

అమరత్వంపై