అధికార దాహంతో
అన్నిరంగాల్లో ఉన్నతాధికారుల్ని
తన కను సన్నల్లో మలుచుకుని
అరాచకంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన
విధ్వంసక జగమెరిగిన చక్రవర్తివాడు
దేశ చరిత్రలోనే
ఎక్కడా కనీవిని ఎరుగని
ఇవియమ్ల విధ్వంసం
పరాకాష్టనందుకున్న రౌడీఇజం
ఇజాలభూమిలో గజానికో
రాజకీయాన్ని సృష్టించి
ప్రజల్ని భయభ్రాంతుల్ని చేసిన వైనం
కిరాతక దురంధర వికృత చేష్టలతో
తన భస్మాసుర హస్తంతో ఆంధ్ర రాష్ట్రాన్ని
అధోగతిపాలు చేసిన చెండాలపు
నాయక మహాశయులార
మీ ఆటలిక సాగవన్నది
రేపటితో చరమగీతం
పాడక తప్పదన్నది నగ్నసత్యం.
అక్రమంగా ఆక్రమించుకున్న
నీ అధికార సామ్రాజ్యం కూలక తప్పదు
నిన్ను నీ అధికారాన్ని రేపటి ప్రజలు
నామ రూపాల్లేకుండా
ఓటు హక్కు నిప్పు పిడికళ్ళు
నిన్ను దహించక తప్పదు.
పురా హిందూ దేవాలయాల్ని
దారుణంగా నేలమట్టం చేసిన
మొగల్ పాదుషా ఔరంగజేబు
అతి కిరాతంగా కుక్క చావు చచ్చాడు
చరిత్రలో ఎందరో ఎంపరర్లు
ఎంపరర్ ఆఫ్ ద రోమన్ నీరో
ఎంపరర్ ఆఫ్ ద రోమన్ కెలిగులా
కింగ్ ఆఫ్ ద బెల్జియమ్ లిపోల్డ్
మంగోలియా సామ్రాజ్యాధినేత
చెంఘిస్ ఖాన్ లాంటివాళ్ళు
జర్మనీ ప్రజల్ని నరకయాతన పెట్టిన
రూలర్ హిట్లర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు
ఇలా సద్దామ్ హుస్సేన్ ఇరాక్
ఈదీ అమీన్ ఉగండా లాంటి
క్రూర కిరాతకులు నేలకరుచుకుపోయారు.
గూండాలు, రౌడీలు, ఫ్యాక్షనిష్టులు
నీ చెప్పు చేతల్లో ఉన్నారని విర్రవీగకు
కత్తులు, కటారులు నిషేధిత బాంబులతో
ఆంధ్రపౌరుల గుండెల్లో దిచుతున్న
తూటాలకు తిరిగి బహుమతి తప్పదు
అయినా వ్యగ్రులై, ఉగ్రులై మండే సూర్యులై
తలవంచని ధీరులై వీర పోరాటం సలుపుతున్న
ప్రతిపక్ష నాయకులారా వందనాలు వందనాలు
ఆంధ్ర ప్రజల తిరుగుబాటు
సముద్రంలా ఉప్పొంగిందో
గుటకలు మింగి గుడ్లు తేలేయాల్సిందే
ఇప్పటికైనా నీ అధికారదాహానికి తిలోదకాలివ్వు
మంచి ప్రతిపక్ష నాయకుడవై
తెలుగు దేశాల్లోనే కాదు
ప్రపంచ దేశాల్లో
శాంతి యోధుడవై ప్రశాంతుడవై నిలిచిపో
కొరుప్రోలు హరనాథ్
97035 42598