శిరమెత్తిన తరాలు
చరిత్ర పుటల్లో..
గళమెత్తిన స్వరాలు
నిషేధ వలయాల్లో
తలదించుక తిరిగే నేటి తరం
నిత్య సుఖాల వేటల్లో
ఉక్కు కండరాలు లేవు
ఇనుప నరాల్లేవు
ఉరికొయ్యను ముద్దాడే
సాహసాల ఉనికి లేదు
ఈసురోమను యువత నిండిన
అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమిది
ఆలస్యంగా వేకప్లు
అంతలోనే ప్రేమలకు బ్రేకప్లు
సమాచార విప్లవ రుచి
అరచేతిలో కవ్వించే స్వర్గం
ఇప్పుడిక్కడ ఎవరి దుఃఖం
సామూహికం కాదు
ఇప్పుడిక్కడ ఎవరి సుఖం
సార్వజనీనం కాదు
ఎవరి ప్రపంచం వారిదే
సామాజిక బాధ్యత ఎండమావే!
పరిఢవిల్లే నేటి పబ్బుల సంస్కృతి
ప్రగతిశీల భావాలకు నిత్య సమాధే!!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి
9440233261