దేశాన్ని ప్రేమించడం అంటే....
మట్టిని మాత్రమే కాదు
మనుషులను ప్రేమించడం.
కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు
వ్యాపించి ఉన్న దేశాన్ని ప్రేమిస్తాం !
అయిదు వేల సంవత్సరాలకు పైగా
మహోన్నత నాగరికతను సృష్టించిన
ప్రజలను అమితంగా ప్రేమిస్తాం !
కళలకు భిన్న సంస్కృతులకు
నిలయమైన మా దేశాన్ని ప్రేమిస్తాం !
అజంతా ఎల్లోరా లాంటి అధ్బుతాలను
కలిగి ఉన్న దేశాన్ని ప్రేమిస్తాం !
సుందర తాజ్ మహల్ ను నిర్మించిన
దేశాన్ని, దేశ ప్రజలను ప్రేమిస్తాం !
వాల్మీకీ, కాళిదాస్, తులసీదాస్
కంబర్, వేమన, నన్నయ్య లాంటి
గొప్పు కవులకు జన్మనిచ్చిన
దేశాన్ని ప్రేమిస్తాం!
దేశాన్ని ప్రేమించడమంటే
ప్రజలను ప్రేమించడమే....!
అది చేయడానికి మేమెప్పుడూ
సర్వదా సిద్దమే !
-పుచ్చలపల్లి సుందరయ్య
(1952 ఆగస్టు 8న రాజ్యసభలో పీడీ యాక్ట్‌పై చర్చ సందర్భంగా పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ప్రసంగం నుంచి)