వీడు పుట్టుడే
దుర్ముహూర్తం గడియలో
భూమి మీదికి వచ్చాడు
అప్పుడే అనుకున్న వీడు
తప్పకుండా బహునాలికల
రాజకీయ నాయకుడు అవుతాడని
ఇప్పుడు ఇంట్లోని వాళ్లనే కాదు
చెప్పిన మాట చెప్పకుండా
సమాజాన్ని బొంకించి బోర్లిస్తునాడు
వీడు నిచ్చెనలను తన్నేసి
మొగులుకు తంతెలు కట్టేలా ఉన్నాడు
-జూకంటి జగన్నాథం
94410 78095