ఆ గొంతును
సవరించుకోమని చెప్పాను
ఆ నిశ్శబ్ద చీకటిని
ఆ రాగం చీల్చి వేస్తుందని
ఆ వేకువని
నిదురపొమ్మని చెప్పాను
వెలుగు వెనుక నీడలో
కలిసిపోతుందని
ఆ భాషకు
మాటలు నేర్వమన్నాను
మూగబోయిన మనసుకు
నాలుకై కదలాలని
ఆ శూన్యంలో కలల్ని
కథలుగా రాయమన్నాను
గువ్వ ఎగిరిపోయాక
కాలంలో నిలిచిపోవాలని
నిశీధిలో
నిశ్శబ్ద మౌనం
మలినం దాచుకుని
అమృతాన్ని కక్కుతూ
- నరెద్దుల రాజారెడ్డి
9666016636